కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి: రాత్రే ప్రకటించిన ప్రణబ్

సిఎల్పీ నేత ఎంపిక బాధ్యతను సోనియా గాంధీకి అప్పగిస్తూ తీర్మానం చేసిన అనంతరం వారంతా లేక్‌వ్యూ అతిథి గృహానికి వెళ్ళి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఫోన్‌లో మాట్లాడారు. నిర్ణయాధికారం అమెకు అప్పగించిన విషయం చెప్పగా ఆమె కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆ విషయాన్ని ప్రణబ్ వెంటనే విలేకరులకు వివరించారు. ఇది జరగడానికి కొద్దిసేపటికి ముందే ఇంటివద్ద ఉన్న కిరణ్‌ను వారు తమ వద్దకు పిలిపించుకున్నారు. ముందుగా ఆయనకు చెప్పాకే ప్రణబ్ ప్రకటన చేశారు.
అంతకు ముందు తెలంగాణకు చెందిన నేతను సీఎంను చేయాలంటూ కొందరు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. ఈ మేరకు సంతకాల సేకరణ జరిగింది. ఇదే సమయంలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు కొందరు వై.వి.సుబ్బారెడ్డి ఇంట్లో సమావేశమై సీఎల్‌పీ సమావేశంలో జగన్‌పై చర్యల విషయం ప్రస్తావనకు వస్తే ధీటుగా స్పందించాలనే నిర్ణయం తీసుకున్నారు. సీఎల్పీ నేత విషయంలో జగన్ పేరును ప్రస్తావిస్తామని కూడా వారు తెలిపారు. సమావేశం కేవలం సీఎల్పీ నేత ఎన్నికకే పరిమితమయింది. జగన్ వర్గ ఎమ్మెల్యేలు మాట్లాడే యత్నం చేయబోగా ఇతర ఎమ్మెల్యేలు వారించారు.












Click it and Unblock the Notifications