కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వైయస్ జగన్ వర్గానికి షాక్?

అందుకే రాష్ట్ర పదహారవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అందరి దృష్టి ఇప్పుడు ఆయన మంత్రివర్గంపై పడింది. ఆయన మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఉంటుంది. పాతవారికే ఉంటుందా, కొత్తవారికి ఉంటుందా, కడప పార్లమెంటు సభ్యుడు జగన్ వర్గానికి షాక్ చెప్పేదిశలో ఉంటుందా, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తారా అనే ప్రశ్న అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. వైఎస్ మృతి అనంతరం రోశయ్య మంత్రివర్గాన్ని మారుస్తాడని తమకు అవకాశం వస్తుందని చాలామంది శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. అయితే అధిష్టానం అందుకు పచ్చజెండా ఊపలేదు. ఇన్నిరోజులు ట్వంటీ 20 ఆటను తలపించిన కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా మారనున్నాయి.
కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా మంత్రి అయిన చిత్తురులో గల్లా అరుణకుమారికి, మెదక్ నుండి సునితా లక్ష్మారెడ్డికి, కరీంనగర్ నుండి శ్రీధర్ బాబుకి, రంగారెడ్డినుండి సబితారెడ్డికి మంత్రవర్గంలో మళ్లీ అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసులపై వేటు ఖాయం. ఇక వరంగల్ జిల్లా తరఫున పొన్నాలకు మొండిచెయ్యి చూపించే అవకాశం ఉంది. కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకరరావుకు, మెదక్ జిల్లా నుండి దామోదర రాజనర్సింహకు, కృష్ణా జిల్లానుండి పాలడుగు, పేర్నిలకు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన దళితుడైన రాజనర్సింహకుగానీ, గీతారెడ్డికిగానీ ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటి మంత్రివర్గంలో ఉన్న జెసి దివాకర్ రెడ్డి, జానారెడ్డిని వైఎస్ తర్వాత పక్కన పెట్టాడు. వారిని కిరణ్ కుమార్ రెడ్డి సీనియారిటీ పరంగా, అనుభవ పూర్వకంగా జగన్ కు చెక్ చెప్పే దిశలో మంత్రివర్గంలో చేర్చుకోవచ్చు. కడప నుండి డిఎల్ రవీంద్రారెడ్డిని కిరణ్ పరీశీలించే అవకాశాలు లేకపోలేదు. కాగా మర్రి శశిధర్ రెడ్డి, నాదెండ్ల, గాదె వెంకటరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిల పేర్లు శాసనసభాపతికి పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications