కిరణ్ కుమార్ రెడ్డికి అసలు సవాలు వైయస్ జగనే

అయితే వృద్ధాప్యం, మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం మోకాలడ్డటంలాంటి పలు కారణాలవల్ల రోశయ్య వైయస్ జగన్ను సమర్థవంతంగా ఎదుర్కొనలేక పోయారు. రోశయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి సైతం జగన్ అసలు సమస్య. వైయస్ బతికి ఉన్నప్పుడు రోశయ్య, కిరణ్ కుమార్ లు ఆయనకు రెండు భుజాల్లా ఉండేవారు. ఇప్పుడు వారే జగన్ కు ఆగర్భ శత్రువుల్లా మారారు. కారణం తనకు కాకుండా రోశయ్యను ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిలను అత్యున్నత స్థాయిలో కూర్చుండబెట్టడమే జగన్ ఆక్రోషానికి కారణం.! అందుకే రోశయ్య పాలనను తన పత్రికలో, టీవీలో దుమ్మెత్తి పోయటమే కాకుండా రోశయ్య వెళ్లిన ప్రతిచోట జగన్ వర్గీయులు ఆయనను నిలదీయటం, జగనే ముఖ్యమంత్రి చేయాలని డిమాండు చేయటం రోశయ్యను అసహనానికి గురి చేసింది. రోశయ్యకు మొదట మంత్రులు కూడా సహకరించలేదు.
ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో కూడా వైయస్ జగన్, ఆయన అనుచరులు వాటిని పునరావృతం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే రోశయ్యకు లేని అవకాశం కిరణ్ కు వచ్చింది. అది మంత్రివర్గ విస్తరణ.రోశయ్యకు మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. కాని కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం మంత్రివర్గ విస్తరణ చేసుకునే అవకాశం ఉంది. సో జగన్ అనుచరవర్గాన్ని ఆయన దూరం పెట్టి రాజకీయ ఎత్తుగడలతో జగన్ కు చెక్ చెప్పే అవకాశాలు ఉంటాయి. అందులోనూ యువకుడు కాబట్టి జగన్ కు పర్మనెంట్ గా చెక్ చెప్పజూస్తాడు. అధిష్టానం కూడా ఆ దిశలోనే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. యువకుడైన కిరణ్ కుమార్ రెడ్డి కూడా జగన్ సామాజిక వర్గానికి చెందినవాడు, అందులోను రాయలసీమకు చెందినవాడు. కాబట్టి రాయలసీమలో జగన్ కు చెక్ చెప్పే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.












Click it and Unblock the Notifications