మంత్రి పదవి కోసం ఢిల్లీ వెళ్లలేదు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: మంత్రి పదవి సమర్థులకే కాంగ్రెస్ అధిష్టానం ఇస్తుందని తాను భావిస్తున్నానని తాజా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరులతో ఆదివారం అన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. ఆ విషయం గురించే తాను ఆలోచించటం లేదన్నారు. మంత్రివర్గంలో చోటు దక్కినా దక్కకున్నా ప్రజల సమస్యలకే ప్రాధాన్యం ఇస్తాన్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు. అందుకే మంత్రి పదవి కోసం తాను న్యూఢిల్లీ వెళ్లలేదన్నారు. అయితే జిల్లాకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.