కడప ఎంపీ జగన్ కు దూరమవుతున్న వైఎస్ వివేకానంద, కెవిపి!

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ కోసం ముఖ్యమంత్రియే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కానీ జగన్ బాబాయ్ వివేకానందకు మాత్రం ఈజీగానే మేడంతో భేటీ అయ్యే అవకాశం వచ్చింది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి జగన్ నుండి వేరు చేయడం ఒక ఎత్తు అయితే, వైఎస్ కుటుంబం వారికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకోవటం రెండో ఎత్తు. అయితే దీనిపై జగన్ వర్గం మాత్రం కారాలు మిరియాలు నూరుతోంది. ఇక కెవిపి రామచంద్రారావు కూడా క్రమంగా జగన్ కు దూరం అవుతున్నాడని తెలుస్తుంది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ దూకుడును తగ్గించాలని సూచించాడు. అయితే కెవిపి మాటలు జగన్ పెడచెవిన పెట్టాడు.
దాంతో కెవిపి రోశయ్యకు సన్నిహితంగా మెలిగారు. ఇప్పటికీ జగన్ తన దూకుడు తగ్గించుకోక పోవటంతో కెవిపి ఇప్పుడు కిరణ్ పాట పాడే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తో భేటీ అయ్యారు. మంత్రి వర్గ విస్తరణపై వారు చర్చించినట్లు సమాచారం. ఎవరెవరు ఉండాలి, సీనియర్లకు అవకాశం, జగన్ సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకోవాలా లేదా అని పలు విషయాలను చర్చించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications