టెన్షన్ అంతా మీడియాకే, ప్రభుత్వానికి ఢోకా లేదు: కిరణ్ కుమార్

Kiran Kumar Reddy
హైదరాబాద్: టెన్షనంతా మీడియాకేనని, తమకేమీ టెన్షన్ లేదని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తన ప్రభుత్వానికి ఢోకా ఏమీ లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్, వైయస్ విజయలక్ష్మి రాజీనామాల నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. శాసనసభ్యులంతా తమతోనే ఉన్నారని ఆయన అన్నారు. మంత్రి వర్గ జాబితాను అధిష్టానంతో ఖరారు చేయించుకున్న కిరణ్ కుమార్ సోమవారం ఉదయం హైదరాబాదు చేరుకున్నారు. వైయస్ జగన్, విజయలక్ష్మి రాజీనామా చేసిన నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై దృష్టి పెడుతూనే ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. గురువారం మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డిని సోమవారం ఉదయం మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, దానం నాగేందర్, పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తదితరులు కలిశారు. వారితో ఆయన మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం రాజభవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. ప్రమాణం స్వీకారం చేసే మంత్రులు జాబితాను ఆయన గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. లేక్ వ్యూ అతిథి గృహంలో శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+