హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెఆర్ సురేష్ రెడ్డికి మంత్రి పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి పట్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

KR Suresh Reddy
హైదరాబాద్: మాజీ స్పీకర్‌ కెఆర్‌ సురేష్‌ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగతంగాను తనకు సన్నిహితుడైన సురేష్‌ను మంత్రిని చేసి, ఆపై ఎమ్మెల్సీని చేయాలనేది ఆయన ఆలోచన. అధిష్ఠానం దీనిపై మల్లగుల్లాలు పడి విముఖత చూపినట్లు చెబుతున్నారు. సురేష్‌ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేని పరిస్థితి వస్తే ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా తీసుకోవచ్చునని సమాచారం. ఆర్థిక లేదా ఇతర కీలక అంశాలకు సంబంధించి ఆయన సేవలను వినియోగించుకోవచ్చునని భావిస్తున్నారు. ఇదేవిధంగా కొందరు మాజీ ఉన్నతాధికారులతో సొంత బృందాన్ని తయారు చేసుకోవాలని నిర్ణయించారు.

సలహాదారులందరి రాజీనామాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ ‌ను ఆదేశించడంతో ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 మందికిపైగా సలహాదారులు కొనసాగుతున్నారు. ఇందులో 10 మంది ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. వైఎస్‌ అధికారంలోకి వచ్చాక తన సన్నిహితులైన నేతలు, విశ్రాంత అధికారులకు పునరావాసం కల్పించేందుకు వారిని సలహాదారులుగా నియమించారు. సోమయాజులు (వ్యవసాయం), సీసీరెడ్డి (విదేశీ పెట్టుబడులు), సీఎస్‌ రావు(ఐటీ), పీటర్‌ హాసన్‌ (పరిశ్రమలు), స్టాన్లీ బాబు(పురపాలక శాఖ) తదితరులు ఇందులో ఉన్నారు. వీరుగాక ఆర్థిక శాఖ, నీటిపారుదల తదితర శాఖలకు ప్రత్యేకంగా సలహాదారుల నియామకం జరిగింది. ప్రతీశాఖలోనూ ఆర్థిక సలహాదారులను నియమించుకున్నారు. ముస్లిం రిజర్వేషన్ల అమలుకోసం బీసీ సంక్షేమ శాఖలోనూ ఒక సలహాదారుని నియమించారు.

సలహాదారుల సంస్కృతి ఏ స్థాయికి చేరిందంటే రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)లో ఏకంగా 25 మందిని సలహాదారుల పేరిట నియమించారు. ఆ సంస్థలో కేవీపీ సమీప బంధువైన పార్థసారధిరావును మూడేళ్ల పాటు సలహాదారుగా కీలకమైన బాధ్యతల్లో కొనసాగించారు. వైఎస్‌ అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టిన రోశయ్య హయాంలోనూ సలహాదారుల నియామకాలు కొనసాగాయి. ముఖ్యులందరికీ పదవీకాలం పొడిగించారు. చివరికి రోశయ్య సైతం పీకే అగర్వాల్‌ అనే విశ్రాంత ఐఏఎస్‌ను సలహాదారుగా నియమించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X