అధిష్టానం పెంచిన పాము బుస కొట్టింది: జగన్ పై రేవంత్ రెడ్డి

వైయస్ జగన్ ఇప్పుడు సచ్చీలత, విశ్వసనీయత, ఉన్నత విలువల గురించి మాట్లాడుతున్నారని, అయితే ఆయన జగన్ కు విశ్వసనీయతపై నమ్మకముంటే నమ్ముకున్న ప్రజలను మోసం చేసి లక్షలకోట్ల రూపాయలు ఈ ఐదున్నరేళ్లలో రాష్ట్ర ఖజానా నుండి కొల్లగొట్టారని, వాటిని వెంటనే ఖజానాకు తిరిగి ఇవ్వాల్సిందిగా మరో నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావుసూచించారు. 125 సంవత్సరాలు వేడుకలు జరుపుకొని 15 రోజులు పూర్తికాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెసు, జగన్ కొట్టుకుంటున్నాయని ఆయితే వారు వాటిని పక్కకు పెట్టి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. వారి చర్యలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పంట నష్టపరిహారం, ఉద్యోగుల సమస్యలు నెలకొన్నాయన్నారు. అధిష్టానం వాటాలు అడుగుతుంటే జగన్ ముఖ్యమంత్రి పదవి కావాలని పోరాడుతున్నారన్నారు. అధిష్టానానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జగన్ అక్రమ లక్షకోట్లపై ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఆ అక్రమాలన్నీ బయటపడితే రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు.












Click it and Unblock the Notifications