వైయస్ జగన్ పై కాంగ్రెసు అధిష్టానం చాలా ఓపిక పట్టింది: దామోదర్ రెడ్డి

R Damodar Reddy
హైదరాబాద్: పార్లమెంటు సభ్యత్వానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన రాష్ట్రంలో పార్టీకిగానీ, ప్రభుత్వానికిగానీ వచ్చే నష్టమేమీ లేదని మాజీమంత్రి దామోదర రెడ్డి సోమవారం విలేకరులతే మాట్లాడుతూ అన్నారు. జగన్ తన పరిధిని దాటినప్పటికీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఓపికతో ఉన్నారన్నారు. పార్టీ ఆయనను బయటకు గెంటివేసిందనటంలే నిజం లేదన్నారు. పార్టీ ఇప్పటికే బలంగా ఉందని, అయితే ఇప్పుడు మరింత బలపడే అవకాశాలున్నాయన్నారు. మేమందరం అధిష్టానం వెంట ఉండి సోనియా నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు. అధిష్టానానికి ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

వైయస్ వివేకానంద శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా పని చేశారని, ఆయనతో మాట్లాడితే తప్పేమిటని ప్రశ్నించారు. వివేకానంద పార్టీని బలోపేతం చేస్తాడనే ఆయనతో భేటీ అయ్యారన్నారు. పార్టీ వ్యక్తి అనుకున్నప్పుడు ఓదార్పు యాత్రలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు ఎందుకు పెట్టడం లేదన్నారు. పార్టీకి కుటుంబాన్ని చీల్చాల్సిన అవసరం లేదన్నారు. వైయస్సార్ ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెసు అధిష్టానమేనన్నారు.

జగన్ రాజీనామా ఆశ్యర్యకరమైన విషయమేమీ కాదని శాసనమండలి సభ్యుడు యాదవరెడ్డి అన్నారు. ఆయన కొత్త పార్టీకి ప్రణాళికలు తయారు చేసుకున్నాడని తాను ఎప్పుడో చెప్పానని గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, కుటుంబాన్ని ముక్కలు చేస్తుందనడం చెప్పడానికే తప్ప ఆయన పార్టీనుండి బయటకు వెళ్లడానికి కారణాలు మాత్రం కావన్నారు. వివేకానందరెడ్డి సీనియర్ అని ఆయనతో పార్టీ నాయకులు చర్చిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఆయనకేదో మంత్రి పదవి ఇస్తారంటే విడిపోయారనేది శుద్ధ అబద్దమన్నారు. చెన్నారెడ్డి కూడా కొత్త పార్టీ పెట్టి మళ్లీ కాంగ్రెసు లోకే వచ్చారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+