డిసెంబర్ 1న లేదా 10న వైయస్ జగన్ కొత్త పార్టీ ప్రకటన?

వైయస్ జగన్ సోమవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైల్లో ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంది. గురువారంనాడు ఇడుపులపాయకు రావాల్సిందిగా ఆయన తన అభిమానులకు సూచిస్తున్నారు. దాన్ని బట్టి గురువారంనాడు కొత్త పార్టీ గురించి ప్రకటిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు కాకపోతే పదవ తేదీన ఆయన తన పార్టీ గురించి మాట్లాడే అవకాశం ఉంది.
కాగా, త్వరలోనే వైయస్ జగన్ పార్టీ పెడతారని వైయస్ జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ రెహ్మాన్ కూడా అదే విషయం చెప్పారు. కొండా సురేఖ వంటివారు మాత్రం పార్టీ గురించి వైయస్ జగన్ తమతో మాట్లాడలేదని అన్నారు.












Click it and Unblock the Notifications