కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పులివెందుల అసెంబ్లీ సీటు నుంచి వైయస్ జగన్ పోటీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ పులివెందుల శానససభా స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. పులివెందుల నుంచి శానససభకు ఎన్నిక కావడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకునే రాజకీయాలను నడపాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పులివెందుల శాసనసభా సీటుకు తల్లి వైయస్ విజయలక్ష్మి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో పులివెందులు సీటు ఖాళీ అవుతుంది. దాంతో కడప లోకసభ స్థానానికి, పులివెందుల అసెంబ్లీ సీటుకు ఆరు నెలల్లోగా ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది. ఆ సమయంలో తాను శాసనసభకు పోటీ చేసి, బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి చేత లోకసభకు పోటీ చేయించాలనే ఎత్తుగడతో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.

వైయస్ వివేకానంద రెడ్డితో సయోధ్యకు అది ప్రాతిపదికగా పని చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వైయస్ వివేకానంద రెడ్డి మనసు మార్చుకుని వైయస్ జగన్ తో సయోధ్యకు అంగీకరించినట్లు చెబుతున్నారు. శాసనసభలో అడుగు పెట్టడం ద్వారా వివిధ పార్టీల శాసనసభ్యుల శక్తిమేర చీల్చి అధికారాన్ని సొంతం చేసుకునే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అవసరమైతే తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలతో పొత్తుకు కూడా ఆయన సిద్ధపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X