కిరణ్ కుమార్ దిగ్భ్రాంతి: సురేష్ రెడ్డి, మహేందర్ రెడ్డిలతో చర్చలు

తమకు అప్రాధాన్యమైన శాఖలు కేటాయించారంటూ సీనియర్ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏం చేయాలనే విషయంపై కిరణ్ కుమార్ రెడ్డి మల్లగుల్లాలు పడుతున్నారు. కాపులు, ఎస్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెడ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. దీన్ని సరిదిద్దుకోవడం ఎలాగో కిరణ్ కుమార్ రెడ్డికి అంతు పట్టని విషయంగా ఉంది. శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. అసమ్మతి మంత్రుల తరఫున మాట్లాడడానికి ఆయన ముఖ్యమంత్రి నివాసానికి వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications