అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తా: మర్రి శశిధర్ రెడ్డి

రాష్ట్రంలోని పరిస్థితుల గురించి గానీ ఇతర విషయాల గురించి సోనియా గాంధీ తనతో ప్రత్యేకంగా మాట్లాడలేదని ఆయన చెప్పారు. పదవుల విషయం కూడా తాను మాట్లాడలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ చేయూత అందించాల్సిన అవసరం ఉందనే ప్రస్తావన మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు. 2014లో తిరిగి పార్టీని అధికారంలోకి తేవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం గురించి మాట్లాడినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications