కులాల మధ్య చిచ్చు పెడుతోంది: ప్రభుత్వంపై మోత్కుపల్లి నర్సింహులు

మాదిగ కులానికి చెందినవారిపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసుల చేత లాఠీచార్జీ చేయించి ప్రభుత్వం చరిత్రహీనంగా మిగిలిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 15 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నారని, శానససభలో ఎస్సీ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్మానం జరిగిందని, రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని అమలులోకి తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తాము శాసనసభలో పోరాడుతామని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications