ఇరిగేషన్ ఏఇ విఠల్ అక్రమాస్తులు సుమారు రూ.రెండు కోట్లు!
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ(ఏసిబి)వారికి మరో అవినీతి చేప దొరికింది. ఇరిగేషన్ ఏఇగా పనిచేస్తున్న విఠల్ ఇంటిపై ఏసిబి అధికారులు బుధవారం ఉదయం దాడులు నిర్వహించారు. బోయినపల్లిలోని ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు కోట్లాది రూపాయల అక్రమ అస్తులను గుర్తించారు. ఆయన ఇంటిలో బ్యాంకు పత్రాలు, విలువైన ఇతర పత్రాలు దొరికినట్టు సమాచారం. విఠల్ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని తమకు పరిపూర్ణమైన ఆధారాలు లభించిన తర్వాతే సోదాలు చేసినట్టు చెప్పారు. సోదాల్లో సుమారు రెండు కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించినట్టు.