రేపటి నుంచి ఆరు రోజుల పాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన గురువారం ఉదయం జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, తెదేపా నేతలు అశోక్ గజపతి రాజు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, తెరాస శాసనసభ్యులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యే సభలో ఎలాంటి ప్రశ్నోత్తరాల సమయం లేకుండా నేరుగా రైతుల సమస్యపై, వరదలపై చర్చిస్తారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులపై కూడా చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications