హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజా సమస్యలపై మొదటి సారి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: గత 14 నెలలుగా అత్యున్నత పీఠంపై ఎలా కూర్చుందామా అని స్కెచ్ లు వేసిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ప్రజా సమస్యలు అంటూ రోడ్డెక్కడానికి నిర్ణయించుకున్నట్టున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి నుండి కుటుంబ వారసత్వంతో పాటుగా రాజకీయ వారసత్వ అర్హత కూడా తనకే ఉంటుందని ఇన్నాళ్లు ఆ స్థానంపై కూర్చోవడానికి శతధా ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఇప్పుడప్పుడే అసాధ్యమని తేలడంతో కాంగ్రెసు నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతానని ప్రకటన సైతం చేశారు. వైయస్ ఇమేజ్ తోనే ఇన్నాళ్లూ రాజకీయ జీవితాన్ని జగన్ నెట్టుకొచ్చాడు.

తండ్రి ఇమేజ్ తోనే ముఖ్యమంత్రిగా కూర్చుందామని కలలు గన్నాడు. కాని అది నెరవేరలేదు. తాను పార్టీ పెట్టిన తర్వాత తండ్రి ఇమేజ్ ఒక్కటే సరిపోదు. జగన్ ప్రజా సమస్యల గురించి ప్రజలలో మమేకమైంది ఎప్పుడూ లేదు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించలేదని ఆరోపణలూ ఉన్నాయి.అప్పుడు ఆ వెలితిని వైయస్, ఆయన చిన్నాన్న వైయస్ వివేకానంద తీర్చారు. పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ వ్యాపారలావాదేవీలకే జగన్ పరిమితమయ్యాడనే వారున్నారు. వైయస్ చనిపోయాక ఆయన ఇమేజ్ తో ముఖ్యమంత్రి గద్దెనెక్కుదాం అనుకుంటే అదీ బెడిసి కొట్టింది.

ఆ స్థానం కోసమే ఆయన ఓదార్పు చేపట్టారని, ఇప్పుడు పార్టీ పెట్టడానికీ కారణం అదేనంటున్నారు ఆయన వ్యతిరేకులు. జగన్ పెట్టే పార్టీ తన కోరికను తీర్చేదిగా ఉండాలంటే ప్రజలు ఆమోదం కావాలి. దానికి తండ్రి ఇమేజ్ ఒక్కటే సరిపోదు. కాబట్టే ఆయన ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై దృష్టి పెట్టాలనుకున్నట్టున్నారు. అందులో భాగంగానే శుక్రవారం, శనివారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని తెనాలి, ఆవనిగడ్డ వంటి వర్షాభావ ప్రాంతాలలో పర్యటించాలని నిశ్చయించుకున్నట్టున్నారు. ప్రజల మధ్య ఓదార్పు చేపట్టినప్పటికీ ఆయన దానిని ఎందుకు చేపట్టారో అందరికీ తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X