కెవిపి రామచందర్ రావు బ్రోకర్, కుట్రదారుడు: కొండా సురేఖ ఫైర్

వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు వైపే ఉంటానని చెప్పడానికి ముందు కెవిపి నివాసంలో సమావేశమయ్యారని ఆమె చెప్పారు. సలహాదారుగా ప్రభుత్వానికి కెవిపి ఇచ్చిన సలహా ఏమిటని ఆమె అడిగారు. ప్రభుత్వానికి ప్రజలు మేలు చేసే ఒక్క సలహా కూడా కెవిపి ఇవ్వలేదని ఆమె అన్నారు. వైయస్సార్ కు కెవిపి తప్పుడు సలహాలతో చెడ్డ పేరు తెచ్చారని ఆమె అన్నారు. కెవిపి నిర్లక్ష్యం వల్లనే వైయస్సార్ ప్రమాదంలో మరణించారని ఆమె ఆరోపించారు. వైయస్సార్ మరణానికి కెవిపి బాధ్యత లేదా, ఎందుకు రాజీనామా చేయలేదని ఆమె అడిగారు.
వైయస్సార్ ముఖ్యమంత్రి కాక ముందు కెవిపి ఆస్తి ఎంత, ఇప్పుడెంత అనే విషయంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆమె అన్నారు. వైయస్సార్ కు తాను సన్నిహితుడనని చెప్పుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించారని ఆమె ఆరోపించారు. ఇలాంటి బ్రోకర్ నా మిత్రుడా అని వైయస్సార్ ఆత్మ ఘోషిస్తుందని ఆమె అన్నారు. వైయస్ మరణం హత్య అని తెలుస్తోందని ఆమె అన్నారు. వైయస్సార్ మరణించినప్పుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని సంతకాల సేకరణ జరిపించింది కెవిపి రామచంద్రారావేనని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications