రైతు సమస్యలపై బాబు పాదయాత్ర: కొంత మంది ఎమ్మెల్యేలు డుమ్మా

Chandrababu Naidu
హైదరాబాద్‌: రైతు సమస్యలపై శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ నుంచి శాసనసభ వరకు తెలుగుదేశం పార్టీ తలపెట్టిన పాదయాత్రకు పలువురు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. ఈ పాదయాత్రకు తప్పకుండా హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించిన వారు పట్టించుకోలేదు. అయితే, పెళ్లిళ్లకు వెళ్లనవారు ఆలస్యంగా వస్తామని చెప్పారని, దాని వల్ల కొంత మంది రాలేకపోయారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్టీఆర్‌ ఘాట్‌ నుంచి అసెంబ్లీకి తెదేపా నేతలు పాదయాత్రగా బయల్దేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులంతా సంఘటితంగా పోరాడేందుకు ముందుకు రావాలన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బందనానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+