కెవిపి బ్రోకర్, కలెక్షన్ కింగ్ అని మేం ఆనాడే చెప్పాం: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు బ్రోకర్ అని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమర్థించారు. కెవిపి రామచందర్ రావు బ్రోకర్, కలెక్షన్ కింగ్ అని తాము గత ఆరున్నరేళ్లుగా చెబుతున్నామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బ్రోకర్ కెవిపి రామచందర్ రావు అంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తే వైయస్ రాజశేఖర రెడ్డి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించారో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుని, ప్రజలకు పంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై మీడియా, ప్రజలు పోరాటం చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుని ఖర్చు పెడితే రైతులకు ఈ కష్టాలు ఉండేవి కావని ఆయన అన్నారు.

అవినీతి, అసమర్థ ప్రభుత్వం వల్లనే రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆయన అన్నారు. రైతులపై ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరం లేదని ఆయన విమర్శించారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తే సరిపోదని వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన అన్నారు. తమ శాసనసభ్యులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారని ఆయన చెప్పారు. రైతు సమస్యలపై ఎల్లుండి మరోసారి ధర్నా చేస్తామని ఆయన చెప్పారు. అక్రమ సంపాదనను విదేశీ బ్యాంకులకు తరలించి కాంగ్రెసు నాయకులు తిరిగి పెట్టుబడుల రూపంలో దేశంలోకి తెస్తున్నారని ఆయన విమర్సించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+