వైయస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డారా, సురేఖ కావాలని చేశారా?

కొండా సురేఖ రాసిన లేఖతో వైయస్ జగన్ కు సంబంధం లేదని ఆయన వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు కూడా చెప్పారు. అయితే, వైయస్ జగన్ వ్యూహాన్ని మొదటి నుంచి అర్థం చేసుకున్నవారు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాను చేయాల్సిన పనులు తన వర్గం వారితో చేయిస్తూ తనకు సంబంధం లేదని అనిపించుకోవడం వైయస్ జగన్ కు అలవాటేనని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాపై అంబటి రాంబాబు వంటి వారితో విమర్శలు చేయించి వైయస్ జగన్ కు ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదని అనిపించారని అంటున్నారు. అందువల్ల బహిరంగ లేఖ రాయడం వెనక తప్పకుండా వైయస్ జగన్ పాత్ర ఉందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, మరో వాదన కూడా ముందుకు వస్తోంది. కొండా సురేఖ భర్త, ఎమ్మెల్సీ ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరయ్యారని, ఒకటి రెండు సార్లు ఆయన ముఖ్యమంత్రిని కూడా కలిశారని, ఇందులో భాగంగానే కొండా సురేఖ వెలువడిందనే అభిప్రాయం కూడా ఉంది. తనకు ఏ మాత్రం నచ్చని కెవిపిని ఇబ్బంది పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి కొండా మురళిని వాడుకున్నట్లు చెబుతున్నారు. కొండా సురేఖ దంపతులు వైయస్ జగన్ కు దూరం కావాలనే ఉద్దేశంతో ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణపై వైయస్ జగన్ వైఖరిని మారుస్తామంటూ ఆమె పెద్ద యెత్తున ప్రకటనలు చేయడం కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు. ఏమైనా, ప్రస్తుత పరిణామాలు వైయస్ జగన్ కు ఇబ్బందికరంగానే ఉన్నాయి.












Click it and Unblock the Notifications