వైయస్ జగనొక్కడే ప్రస్తుతం సరైన నాయకుడు: లక్ష్మీపార్వతి

Laxmi Parvathi
విశాఖపట్నం: ప్రస్తుత విపత్కర పరిస్థితిలో రాష్టానికి కొత్త నాయకత్వం కావాలని, ఆ ఖాళీని భర్తీ చేసేది వైయస్ జగన్ ఒక్కడేనని స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. మనస్తాపానికి గురైన వైయస్ జగన్ తెలుగు ప్రజల గౌరవం నిలబెడానని వైయస్ జగన్ అంటున్నాడని, అందువల్ల ఆ అబ్బాయిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో గతంలో ఎన్టీ రామారావు విజయం సాధించినట్లుగానే ఇప్పుడు వైయస్ జగన్ ప్రజల మన్ననలు పొందుతారని ఆమె అన్నారు. వైయస్ జగన్ సభలకు వచ్చేవారంతా వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులేనని, వైయస్ జగన్ కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని ఆమె అన్నారు.

రాష్ట్ర పార్లమెంటు సభ్యులు తీరుకు నిరసనగా తాను ఓ కార్యక్రమాన్ని తీసుకుంటానని ఆమె చెప్పారు. హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాగీర్ కాదని ఆమె అన్నారు. లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణను హైదరాబాదులో తిరగనివ్వబోమని తెరాస నాయకులు ప్రకటించడం ప్రజాస్వామ్యంలో నేరమని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+