కెవిపిని టార్గెట్ చేసిన విహెచ్: వివరణ ఇవ్వాలని డిమాండ్

V Hanumantha Rao
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు కెవిపి రామచందర్ రావును కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంత రావు టార్గెట్ చేసుకున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన వైయస్ జగన్ నే కాకుండా కెవిపిని కూడా టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. కెవిపి వివరణ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించి నిజానిజాలు తేల్చాలని ఆయన అన్నారు. జగన్, కెవిపిల లావాదేవీల్లో కాంగ్రెసు ఎందుకు నష్టపోవాలని ఆయన అడిగారు. పెద్ద కర్మ జరగక ముందే, వైయస్సార్ శవాన్ని ముందు పెట్టుకుని సంతకాల సేకరణ జరిపింది వైయస్ జగనే అని ఆయన అన్నారు. జగన్ కు తెలియకుండా కెవిపి రామచందర్ రావు సంతకాల సేకరణ జరిపించారని కొండా సురేఖ అంటున్నారని, ఇందులో నిజానిజాలు ఏమిటో తెలియాలని ఆయన అన్నారు.

కెవిపి రామచందర్ రావు, వైయస్ జగన్ ఒక్కటే అనుకుంటున్నామని, ఒక్క ఆత్మ పైకి పోతే మరో ఆత్మ ఇక్కడే ఉందని అనుకుంటున్నామని, ఇప్పుడు కెవిపి, వైయస్ జగన్ కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయని భావిస్తున్నామని, ఏడాదిన్నర తర్వాత అవి బయటపడ్డాయని, ఆ భేదాభిప్రాయాలు ఏమిటో కెవిపి చెప్పాలని ఆయన అన్నారు. కెవిపి ఆరోపణలు తన సొంతమేనని కొండా సురేఖ చెబుతున్నా వైయస్ జగన్ నుంచో, వైయస్సార్ కుటుంబం నుంచో మాత్రమే ఆ బహిరంగ లేఖ వచ్చిందని ఆయన అన్నారు. ఓ వైబ్ సైట్ కథనం ఆధారంగా రిలయన్స్ కార్యాలయాలపై దాడులు జరిగినప్పుడు కెవిపి భద్రతా సలహాదారుగా ఉన్నారని అంటున్నారని ఆయన అన్నారు. కెవిపి, వైయస్ జగన్ లావాదేవీల కొట్లాట వల్ల కాంగ్రెసు పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. తాము తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+