వైయస్ జగన్ కొత్త పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ?

YS Vijayamma
హైదరాబాద్: తాను స్థాపించబోయే కొత్త పార్టీకి వైయస్ జగన్ తన తల్లి వైయస్ విజయమ్మను అధ్యక్షురాలిగా పెట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. దివంగత నేత, తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి, ఆదరణ దృష్ట్యా విజయమ్మను అధ్యక్షురాలిగా పెడితే కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక అభిప్రాయపడింది. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. తన తల్లికి రాజకీయాలు తెలియకపోయినా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉందని ఇటీవల ఆయన పులివెందుల సభలో అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ద్వారా ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టించింది వైయస్ విజయమ్మేననే ప్రచారం ఉంది. తల్లిని పార్టీ అధ్యక్షురాలిగా పెడితే ఆ రకంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి వైయస్ విజయమ్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వచ్చే 45 రోజుల్లో పార్టీని స్థాపిస్తానని వైయస్ జగన్ ఇప్పటికే చెప్పారు. అయితే, అంతకన్నా ముందుగానే ఆయన తన పార్టీని స్థాపించే అవకాశం ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+