మళ్లీ ఉస్మానియా ఉద్రిక్తత, సబిత ప్రకటనపై విద్యార్థుల బైక్ ర్యాలీ

Osmania University
హైదరాబాద్: ఉద్యమాల కారణంగా విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి అసెంబ్లీ వరకు బైకు ర్యాలీ చేపట్టారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు వేరే మార్గంలో అసెంబ్లీ వైపు దూసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. విద్యార్థులు ఐదు జట్లుగా విడిపోయి వేరువేరు మార్గాలలో అసెంబ్లీ వైపు వెళుతున్నారు. వారిని సైతం పోలీసులు అడ్డుకున్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కాగా విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామన్న హోంమంత్రి సబితారెడ్డి ప్రకటన స్పష్టంగా లేదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం మరింత ఎక్కువవుతుందన్నారు. సోమవారం చర్లపల్లి జైలులో ఉన్న విద్యార్థులను కోదండరాం, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొందరు నేతలు పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+