వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, జగన్ పొలిటికల్ ఎఫెక్ట్: కిరణ్ కుమార్ కు కేంద్రం చేయూత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
న్యూఢిల్లీ: రైతు సమస్యలపై రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతుండడంతో ముఖ్యమమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. తీవ్ర వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆసరాగా నిలిచేందుకు సిద్ధమయ్యింది. తద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలుస్తామని చెప్పకనే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి నిలదీస్తున్న దృష్ట్యా రాష్ట్రానికి 500 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించి కిరణ్ ముప్పేట దాడినుండి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం 1000కోట్ల రూపాయల ప్యాకేజీని అడగింది. అయితే కేంద్రం రూ.500 కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. రంగు వెలిసిన, తడిసిన ధాన్యం కొనేందుకు భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) కొంత నిబంధనలకు సడలించే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత ప్రత్తి సమాఖ్య(సిసిఐ) కూడా పత్తి కొనుగోలుపై ఉదారంగా వ్యవహరించనుంది. రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగించాలని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పోన్ చేసి రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించగా వైయస్ జగన్ ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X