హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తేల్చుకుందాం, రండి: మైక్రో ఫైనాన్స్ లపై ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: శాసనసభలో మంగళవారం సాయంత్రం మైక్రో ఫైనాన్స్ సంస్థలపై తీవ్ర రగడ జరిగింది. మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ఎవరు కొమ్ము కాస్తున్నారో తేల్చుకుందామని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అధికార పక్ష సభ్యులను సవాల్ చేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలకు తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తోందనే మంత్రి రఘువీరా రెడ్డి ఆరోపణపై ప్రతిస్పందిస్తూ చంద్రబాబు ఆ సవాల్ చేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల నియంత్రణ బిల్లును ప్రతిపాదించడానికి ప్రభుత్వం ప్రయత్నించగా రైతు సమస్యలపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో అధికార కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మంత్రి రఘువీరారెడ్డి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రఘువీరా రెడ్డి అబద్ధాలు చెపుతున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యానించారు. దీనిపై రఘువీరా రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందిస్తూ చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. సభా కార్యక్రమాలకు విఘాతం కలగడంతో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

మైక్రో ఫైనాన్స్ లపై ఆర్డినెన్స్ అమలులో ఉన్నందున ఇప్పుడే బిల్లు ప్రతిపాదించాల్సిన అవసరం లేదని, ముందు రైతు సమస్యలపై చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయిందని, అందుకే బిల్లును అడ్డుకుంటోందని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. మేం రాజీపడ్డామో, మీరు రాజీపడ్డామో తేల్చుకుందామని చంద్రబాబు అన్నారు. మైక్రో ఫైనాన్స్ లకు ప్రజలు ఒక్క రూపాయి కూడా కట్టవద్దని తాము ప్రజలకు చెప్పామని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మైక్రో ఫైనాన్స్ సంస్థలు వచ్చాయని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థ ఎస్కెస్ అధిపతి ఆకుల విక్రమ్ కు, కాంగ్రెసు ప్రధాన కార్యదర్సి రాహుల్ గాంధీకి మధ్య ఉన్న సంబంధాలు అందరికీ తెలుసునని తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని, వడ్డీ నియంత్రణ నిబంధన లేకపోవడం బిల్లులో పెద్ద లోపమని తెలుగుదేశం సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X