చెప్పులతో కొట్టుకున్న మాజీ మేయర్ బంగి: పెట్రో పెంపుకు వినూత్ననిరసన

Bangi Ananthaiah
కర్నూలు: వినూత్న రీతిలో తన నిరసనలు తెలియజేసే కర్నూలు మాజీ మేయరు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బంగి అనంతయ్య మరోసారి తన నిరసనను వినూత్నంగా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ఛార్జీలపై మూడు రూపాయల వరకు పెంచింది. అవి ఈ రోజునుండి అమలులోకి వస్తాయి. దీంతో బంగి అనంతయ్య రిక్షా తొక్కి తన నిరసనను తెలియజేశారు. రిక్షా తొక్కుతూ కాంగ్రెసు ప్రభుత్వాన్ని గద్దె నెక్కించడం తప్పు అంటూ తన చెప్పుతో తానే కొట్టుకున్నారు.

కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి పెట్రో ధరలు పలుమార్లు పెంచిందన్నారు. ఈ సంవత్సరంలోనే ఐదారు సార్లు పెంచిందన్నారు. ప్రజల సమస్యలపట్ల కాంగ్రెసు ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రజల సానుభూతిని కాంగ్రెసు కోల్పోతుందన్నారు.

ఇంతకుముందు బంగి అనంతయ్య తన నిరసనలను వినూత్నంగా తెలిపారు. చీర కట్టుకొని స్తీ వేశంలో కూడా ఆయన నిరసన తెలిపారు. రక్త చరిత్ర మొదటి భాగం విడుదలయినపుడు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఉందని కూడా ఆయని వెరైటీగా నిరసన తెలిపారు. వర్మపై నిప్పులు గక్కారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+