మాలధారణలో ఉంటే కళాశాలకు నో అన్న ప్రిన్సిపల్: విద్యార్థుల ఆందోళన

ప్రిన్సిపల్ దురుసు ప్రవర్తనను నిరసిస్తూ విద్యార్థులు రెచ్చిపోయారు. కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టారు. ప్రిన్నిపల్ దురుసు పవర్తనే ఇందుకు కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కళాశాలలోకి సెల్ ఫోన్లు, పర్సులను తీసుకు రావడాన్ని కూడా ప్రిన్సిపల్ నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు రెచ్చి పోయారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రిన్సిపల్ పై విరుచుకు పడుతున్నారు. ఇంతకుముందు కూడా ప్రిన్సిపల్ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. ఓ నిరుపేద రైతు కొడుకు రోజంతా కాళ్లు పట్టుకొని బతిమాలినా చిన్న తప్పుకు కళాశాలలో లోపలకి రానివ్వలేదని ఆరోపిస్తున్నారు. ఇలా పలుమార్లు జరగటంతో విద్యార్థులు విద్యార్థి సంఘాలకు మొరపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా ప్రిన్సిపాల్ తన దురుసు ప్రవర్తనను తగ్గించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రిన్సిపల్ కొత్తగా కళాశాలలో నిబంధనలు పెట్టినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications