రఘువీరారెడ్డి కండకావరంతో మాట్లాడుతున్నారు: నాగం జనార్ధన్ రెడ్డి

ప్రభుత్వం రైతులనుండి క్వింటాలు ధాన్యం కూడా కొనలేదు. కాని రైతులను ఆదుకుంటామని చెబుతుందన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోని రఘువీరారెడ్డి కండకావరంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పత్తి, వరి, చెరుకు నష్టపోయిన రైతులకు 10వేల నష్ట పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించటం లేదు.
కానీ ఒక్కడే మంత్రి లక్షా డెబ్బయివేల కోట్ల అవినీతికి పాల్పడితే తప్పులేదన్నారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వానికి రైతులు, ప్రజల సమస్యలపై చిత్తశుద్ది లేదన్నారు. రైతులను ఆదుకోవడానికే తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నిరవదిక నిరాహార దీక్షకు పూనుకున్నాడన్నారు. బాబు దీక్ష రైతులకు ఖచ్చితంగా మేలు చేస్తుందన్నారు. ఇకనుండి తమ పార్టీ రైతులను ఆదుకోవాలని నినాదంతో ముందుకు వెళుతుందన్నారు.












Click it and Unblock the Notifications