బెజవాడకు చేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు రాజకీయం

YS Jagan
విజయవాడ: హాట్ హాట్ గా మారిన తూర్పు గోదావరి రాజకీయాలు తాజాగా విజయవాడకు చేరుకున్నాయి. ఇప్పటికే పలువురు మాజీలు తాము మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళతామని ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, జక్కంపూడి విజయలక్ష్మి జగన్ ఆధ్వర్యంలోనే ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. తూర్పు గోదావరి నుండి మరింత ఎక్కవమందిని జగన్ వైపు లాగే ప్రయత్నాల్లో భాగంగా సుమారు 200మంది ముఖ్యనేతలను విజయవాడకు తరలించి మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.

జగన్ కు మొదటినుండి మద్దతు పలుకుతున్న మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు ఈ ముఖ్యనేతలకు నాయకత్వం వహిస్తున్నట్టు సమాచారం. ఈ ముఖ్యనేతలతో జక్కంపూడి విజయలక్ష్మి కూడా వెళ్లారు. విజయవాడలోని ఓ ప్రైవైటు అతిథి గృహంలో తూర్పు గోదావరికి చెందిన ముఖ్యనేతలతో పిల్లి సుభాష్ సమావేశమైనట్టు తెలుస్తోంది. వారందరిని కాంగ్రెస్ రాజీనామా చేసి జగన్ వైపు మరలే విధంగా పిల్లి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒక్కో సామాజిక వర్గంనుండి ఒక్కోరిని తీసుకు వచ్చి ఆ సామాజికవర్గాన్ని అకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక వర్గానికి పెద్ద పీట వేసే తూర్పులో అదే సామాజిక వర్గంతో కాంగ్రెస్ కు చెక్ పెట్టాలని జగన్ వర్గం యోచిస్తుంది. మాల వర్గాలు ఎక్కువగా ఉండటంతో అదే వర్గానికి చెందిన శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావును తమవైపుకు లాక్కుంటున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీలోని వారిని మాత్రమే కాకుండా ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల నాయకులను కూడా జగన్ వర్గం లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి ప్రభావం పక్కనున్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పడుతుందని జగన్ వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+