కెసిఆర్, విజయశాంతి ఎందుకు రాజీనామా చేయలేదు: కోమటిరెడ్డి సోదరులు

రాజీనామాలతో తెలంగాణ వస్తుందని నిత్యం జపిస్తున్న మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఎందుకు రాజీనామా చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 41 పార్లమెంటు స్థానాలు సాధించి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. 2014లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి కృషి చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోరిక కూడా అదేనన్నారు.












Click it and Unblock the Notifications