వైయస్ జగన్ దీక్షకు మద్దతిచ్చిన శాసనసభ్యులపై చర్యలు?

వైయస్ జగన్ దీక్షకు వెళ్లిన శాసనసభ్యులపై ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనే అనుమానం కలుగుతోంది. జగన్ కు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల సంఖ్య బయటికే 25 దాకా కనిపిస్తోంది. లోలోపల జగన్ కు ఎంత మంది మద్దతు తెలుపుతున్నారనే అంచనా లేదు. దీంతో ప్రభుత్వం పడిపోతుందేమోననే ఆందోళనతో కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గవచ్చునని అంటున్నారు. వైయస్ జగన్ తనంత తానుగా ప్రభుత్వాన్ని కూల్చడానికి వచ్చే దాకా నిరీక్షించాలని కూడా అనుకుంటూ ఉండవచ్చు.












Click it and Unblock the Notifications