బాలాసోర్: ఒడిషా చాందీపూర్ లోని సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ ఉదయం జరిపిన పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతమయ్యింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి పరిధి అత్యధికంగా 250 కి.మీ. పేలోడ్ సామర్థ్యం 500 కేజీలు. ఒరిస్సా తీరంలోని చండీపూర్ లో గల సమీకృత ప్రయోగం రేంజ్ నుంచి దాన్ని ప్రయోగించారు. బుధవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు దీన్ని ప్రయోగించారు.
ఈ క్షిపణిని ఇదివరకే భారత సాయుధ బలగాల్లో చేర్చారు. ఈ ప్రయోగం లాంఛనంగా వ్యూహాత్మక బలగాల కమాండ్ అధికారులు ప్రయోగించారు. కొన్ని సాంకేతిక సమస్యలపై సెప్టెంబర్ 24వ తేదీన దాన్ని ప్రయోగించడంలో విఫలమయ్యారు.