రోహిత్ కేసులో ఎన్డీ తివారీకి డిఎన్ఎ పరీక్షలకు హైకోర్టు ఆదేశాలు

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు షంషేర్ సింగ్ మనవడు రోహిత్ శేఖర్ తన తండ్రి తివారీయేనని ఢిల్లీ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు. తన తల్లి ఉజ్వల సింగ్ తో తివారీకి గల వైవాహికేతర సంబంధంతోనే తాను పుట్టానని రోహిత్ శేఖర్ పిటిషన్ వేశారు. తనను కుమారుడిగా అంగీకరించడానికి నిరాకరించినందు వల్లనే పిటిషన్ వేసినట్లు రోహిత్ శేఖర్ చెప్పాడు. తాను గౌరవప్రదమైన కుటుంబానికి చెందినదానినని, తన తండ్రి కేంద్ర మాజీ మంత్రి అని, అటువంటి సమాచారం వెల్లడించడానికి తెగువ కావాలని, తాను తన కుమారుడు రోహిత్ కు అండగా నిలబడుతున్నానని అప్పట్లో ఉజ్వల సింగ్ అన్నారు. రోహిత్ శేఖర్ డిఎన్ఎ పరీక్షకు అంగీకరిస్తున్నాడని, అయితే తివారీ అందుకు నిరాకరిస్తున్నారని ఆమె అప్పట్లో చెప్పారు.
రోహిత్ వేసిన పిటిషన్ పై రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ కోర్టు విచారణ పరిధిని ప్రశ్నించారు. తాను ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నానని, రోహిత్ లక్నోలో పుట్టాడని, అందువల్ల ఢిల్లీలో విచారణ సరైంది కాదని ఆయన వాదించారు. రోహిత్ పిటిషన్ ను కోర్టు ఏప్రిల్ లో విచారణకు స్వీకరించి, తివారీకి నోటీసులు పంపింది. రోహిత్ ను కొడుకుగా తివారీ స్వీకరించాలని అప్పట్లో షంషేర్ సింగ్ అన్నారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వానికి కూడా ఆయన లేఖ రాశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications