ముగ్గురు భర్తల ముద్దుల లేడీ అడ్వొకేట్ ను అరెస్టు చేసిన పోలీసులు
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: ముగ్గురు పురుషులను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేసిన ఘరానా మహిళను పోలీసులు శుక్రవారం హైదరాబాదులో అరెస్టు చేశారు. ఆ ఘరానా మహిళ అందరి న్యాయం కోసం పోరాడే న్యాయవాది కావటం విశేషం. హైదరాబాదులోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన హేమలత అనే మహిళా న్యాయవాది ముగ్గురు పురుషులను పెళ్లి చేసుకున్నది. అంతేకాకుండా వారిని డబ్బులకోసం బ్లాక్ మెయిలింగ్ చేసింది. వారి దగ్గరనుండి డబ్బులు వసూలు చేస్తోంది. అయితే అమెపై పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. పోలీసులు హేమలతను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.