బిజెపి సచివాలయ ముట్టడి ఉద్రిక్తం: నాయకుల అరెస్టు

BJP
హైదరాబాద్: రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చౌక్ ఇందిరా పార్కు వద్ద భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మంగళవారం ఉదయంనుండే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గంగారపు కిషన్ రెడ్డి, జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు పలువురు కార్యకర్తలు ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించాయి. వ్యవసాయ శాఖమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల, కడపలలోనే తిరుగుతున్నారని వెంకయ్యనాయుడు ఆరోపించారు. పంటన నష్టపోయిన ప్రాంతాలలో ఆయన పర్యటించాలని డిమాండ్ చేశారు.

రైతులకు వడ్డీలేని రుణాలు అందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈసారి నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం రైతులకు సరిపోదని, మరింత పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి ప్యాకేజీ ప్రకటించిన తర్వాతే ఆ సాయం సరిపోదనే ఉద్దేశ్యంతో రైతుల మరణాలు పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు మరింత సాయం ప్రకటించాలని కోరారు.

అనంతరం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు సచివాలయ ముట్టడికి పూనుకున్నారు. ఇందిరా పార్కు దగ్గరనుండి ర్యాలీగా సచివాలయానికి బయలు దేరారు. అయితే పోలీసులు వారిని ఇందిరా పార్కు వద్దే అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కిషన్ రెడ్డిని, దత్తాత్రేయ, వెంకయ్యనాయుడితో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+