వేరే దారి లేకనే దీక్షలకు దిగాం: సోనియాకు కాంగ్రెసు ఎంపీల లేఖ

తాము దీక్ష చేపట్టిన కొన్ని గంటల్లోనే గద్దర్, విమలక్క లాంటి ముఖ్యులు వచ్చి సంఘీభావం తెలిపారని వివరించారు. 'మీ నాయకత్వంలోని కాంగ్రెస్ మాత్రమే తెలంగాణ ఇస్తుందనే విశ్వాసాన్ని పలువురు వ్యక్తం చేశారు' అని పేర్కొన్నారు. వేలమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దీక్ష శిబిరాన్ని సందర్శించారని తెలిపారు. దీక్ష చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను సోమవారం రాత్రి ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం వైద్య పరీక్షలు చేసింది. ఎంపీ మంద జగన్నాథంకు బీపీ ఎక్కువైందని, దీక్ష చేస్తున్న మిగతావారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications