ప్రముఖ తెలుగు కవి గుడిహాళం రఘునాథం కన్నుమూత

ఆయన మహబూబ్ నగర్ జిల్లా అమరచింతలో జన్మించారు. తెలుగు కవిత్వంలో తనదంటూ ఓ ముద్రను వేసుకున్న గుడిహాళం రఘునాథం మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. తన తొలి కవితా సంపుటి ఫోర్త్ పర్సన్ సింగ్యులర్ తోనే తెలుగు కవితా ప్రపంచంలో తనదైన విశిష్టతను చాటి చెప్పారు. ఆ తర్వాత ఒక జననం - ఒక మరణం అనే కవితా సంపుటిని వెలువరించారు. తెలుగు సమాజంలో మార్పును, సాహిత్యంలో కొత్త విలువలను ఆశిస్తూ ఏర్పడిన విపశ్యన కవుల్లో ఆయన ఒకరు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఏసుపాదం, శివకుమార్, కె. శ్రీనివాస్ లతో కలిసి ఆయన నల్లవలస దీర్ఘ కవిత రాశారు. తెలంగాణ కోణం నుంచి వెలువడిన దీర్ఘ కవిత అది.












Click it and Unblock the Notifications