సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాకు సిద్ధపడాలి: సీమాంధ్ర ఐకాస

ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో అయినా, సీమాంధ్రలో అయినా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే చట్ట విరుద్ద చర్యలకు పాల్పడినా ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకుంటుందనే అపోహలో వారు ఉండిపోతారన్నారు. తద్వారా మరిన్ని అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అయితే ఆవేశంతో చిన్న చిన్న తప్పులు చేసిన వారిపై కేసులు ఎత్తివేయవచ్చన్నారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేత విషయమై గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ దృష్టికి తీసుకు వెళతామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications