ఇక్కడ మనం, అక్కడ వైయస్ జగన్: కెసిఆర్ మధ్యంతర ఆశలు

కెసిఆర్ వైయస్ జగన్ తో అవగాహనకు వస్తున్నారని మీడియా వ్యాఖ్యానించింది. చర్చా కార్యక్రమాలు నిర్వహించింది. వైయస్ జగన్ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతాయని కెసిఆర్ అన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం వైయస్ జగన్ కు లేదని శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పడిపోతే, దానంతటదే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని ఆమె అన్నారు. వైయస్ జగన్ కు తెలంగాణలో కూడా చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు.












Click it and Unblock the Notifications