తెలంగాణకు OG కేసీఆర్.. ఇక కుదరదు - పవన్ కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దేశభక్తి, పోరాటాల గురించి తాము పవన్ కల్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ ఓజీ కేసీఆర్ అని స్పష్టం చేశారు. 2023 ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలంగాణలో పవన్ పోటీ చేశారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్‌ను ఎవరూ అడ్డుకోలేదని.. ప్రజలే అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.

ఏపీ డిప్యూటీ సీఎం... జనసేనాని పవన్ వ్యాఖ్యల పైన తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తు న్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యల పైన స్పందించిన కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌ను గౌరవిస్తామని.. సోదరుడిగా ఇంటికి వస్తే.. హైదరాబాద్ బిర్యానీ పెడతామన్నారు. అంతే కానీ.. తమ సచివాలయంలో కూర్చుంటామంటే కుదరదన్నారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు OG కేసీఆర్ అని.. వేరే ఎవరూ అవసరం లేదన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నాడని కేటీఆర్ అన్నారు. మరి పొట్టి శ్రీరాములు మద్రాస్ నుంచి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు ఆత్మబలిదానం చేసుకున్నారు కదా అది కూడా ప్రాంతీయ వాదం అంటారా అని ప్రశ్నించారు.

'అదే నా రాస్తా’, ఒక్క పోస్టుతో తేల్చేసిన పవన్..!!
'అదే నా రాస్తా’, ఒక్క పోస్టుతో తేల్చేసిన పవన్..!!
brs-working-president-ktr-seriously-reacts-over-janasena-chief-pawan-kalyans-comments-controversy

అప్పట్లోనే జనసేన పోటీ చేసింది

పవన్ కళ్యాణ్.. మీరు ఇక్కడకి రండి.. మీ కుటుంబాలు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా.. ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో జనసేన కొత్తగా చేసేదేముందని కేటీఆర్ అన్నారు. దేశభక్తి గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. 2023 ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసిందని గుర్తుచేశారు. 2018లో చంద్రబాబు కూడా పోటీ చేశారని తెలిపారు. పవన్.. తెలంగాణలో పోటీ చేయండి.. ఎవరు వద్దనటం లేదని చెప్పుకొచ్చారు. ఇక్కడకు వచ్చి అన్యాయంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కదం తొక్కిన నేలని... ఆవిర్భావ దినోత్సవం రోజు విభజన తీరు సరిగా లేదని అంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేసారు. తెలంగాణపై ఉల్టాపల్టా మాటలెందుకు? తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినలేదని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్‌ సభ పెడతానంటే ఎలా అని ప్రశ్నించారు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చని తెలిపారు. ఎక్కడైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొన్ననే అంత కష్టపడి విడిపోయాం కదా.. మళ్లీ మీ పెత్తనం ఎందుకు అని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+