శనిపై బృహస్పతి దృష్టితో నాలుగు రాశులకు ‘కుబేర యోగం’

ఖగోళంలో గ్రహాల కదలికలు ఎప్పుడూ మానవ జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన గ్రహంగా భావించే దేవగురువు బృహస్పతి , న్యాయాధికారి అయిన శని దేవుడిపై తన దృష్టిని సారించాడు. కర్కాటక రాశిలో ఉన్న గురుడి శుభ వీక్షణం, మీన రాశిలోని శని భగవానుడిపై పడటం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అరుదైన, పవిత్రమైన పరిణామంగా పరిగణించబడుతుంది. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. నాలుగు రాశులవారి జాతకం పూర్తిగా మారిపోతోంది. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.

వృశ్చిక రాశి

గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి, సమస్యలతో సతమతమవుతున్న వృశ్చిక రాశి వారికి ఈ గురు దృష్టి పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఆరోగ్య లేదా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సొంతగా వ్యాపారం చేసే వారికి సరికొత్త కాంట్రాక్టులు, పెద్ద డీల్స్ దక్కుతాయి. గృహ వాతావరణం ఎంతో ఆనందంగా మారుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

Horoscope With Jupiter s Aspect on Saturn Four Zodiac Signs Attain Kubera Yoga

మకర రాశి

కష్టాన్ని మాత్రమే నమ్ముకునే మకర రాశి వారికి, వారి శ్రమకు తగిన అసలైన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు ఎప్పటి నుంచో వేసుకుంటున్న ప్లాన్స్, కలలు ఇప్పుడు నిజ రూపం దాలుస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఊహించని విధంగా పెరుగుతుంది. పాత అప్పులు తీరిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు సమాజంలో హోదా, బాధ్యతలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.

వృషభ రాశి

ఈ గ్రహాల మార్పు వృషభ రాశి వారికి ఒక సువర్ణావకాశం లాంటిది. ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన పనులు, కోర్టు వ్యవహారాలు లేదా భూమి వివాదాలు చాలా సులభంగా కొలిక్కి వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి మునుపెన్నడూ లేని విధంగా లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంలో ఉన్న చిన్నపాటి మనస్పర్థలు తొలగిపోయి, ప్రశాంతత, అన్యోన్యత పెరుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ సమయం కెరీర్ పరంగా 'గోల్డెన్ పీరియడ్' అని చెప్పవచ్చు. ఆఫీసులో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ పనితీరును మెచ్చుకోవడమే కాకుండా, ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ కాలంలో చేసే కొత్త పెట్టుబడులు భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయి. మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు మీకు సమాజంలో మంచి గౌరవ మర్యాదలను తెస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+