జాక్ పాట్: శ్రీకృష్ణ ఆర్థిక సంస్కరణల చైర్మన్ గా శ్రీకృష్ణ?

దీంతో కేంద్ర ఆర్థిక శాఖ ఆర్థిక సంస్కరణల రూపకల్పన సమర్థవంతంగా చేయాలని అనుకుంటోంది. ఆ బాధ్యతలను జస్టిస్ శ్రీకృష్ణపై పెట్టాలని యోచిస్తున్నట్టు ఉంది. ఆయనను ఆర్థికరంగ చట్ట సంస్కరణల కమిటీ చైర్మన్ గా నియమించాలనుకుంటున్నట్టు సమాచారం. గత ఫిబ్రవరిలో తెలంగాణపై కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణను నియమించింది. నియమించినప్పుడే 2010 డిసెంబర్ 31కల్లా 11 నెలల్లో తన నివేదికను సంపూర్ణంగా కేంద్రానికి అందిస్తానని చెప్పారు. అన్నట్టుగానే ఆయన డిసెంబర్ 31లోపు సమర్పించారు.
అంతేకాకుండా రాష్ట్రంలో అందరి ద్వారా పూర్తి సమాచారం తీసుకున్నారు. కేంద్రం అప్పజెప్పిన తెలంగాణ అంశంపై తన పనిని గడువులోపు పూర్తి చేయడమే కాకుండా, సమర్థవంతంగా పని చేసి కేంద్రం మన్ననలు పొందారు. ఈ కారణంగానే ఆయన అతి బరువైన ఆర్థిక సంస్కరణల అమలు బాధ్యతను అప్పజెప్పేందుకు ఆర్థిక శాఖ సిద్ధమయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications