రోడ్డు ప్రమాదంలో చిత్తూరుకు చెందిన 8మంది అయ్యప్పల దుర్మరణం
Districts
oi-Srinivas G
By Srinivas
చిత్తూరు: చిత్తూరు జిల్లాకు చెందిన ఎనిమిది మంది అయ్యప్పస్వామి భక్తులు తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తమిళనాడులోని సేలం జిల్లా వామలూరు వద్ద జరిగిన ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే మృతులంతా చిత్తూరు జిల్లా కుప్పం వాసులే. ఆగి ఉన్న ఈ అయ్యప్ప భక్తుల వాహనాన్ని ఓ లారీ అతివేగంతో వచ్చి ఢీ కొట్టింది. దీంతో వారు అక్కడికి అక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితిపై కూడా తీవ్ర ఆందోళనగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.