చెప్పానుగా అదే వచ్చింది: మీడియాతో గవర్నర్ నరసింహన్

కాగా రాష్ట్ర గవర్నర్ గా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తండ్రిలా వ్యవహరిస్తానని గవర్నర్ చెప్పారు. తాను పాలనలో జోక్యం చేసుకుంటున్నానన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. ఒక గవర్నర్ ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తానని పాలనతో తనకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర పరిస్థితులు 2011లో బాగానే ఉంటాయని చెప్పారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగదని, ఆయితే దానిని ఇప్పుడే పూర్తిగా చెప్పలేమన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో తనకు సంబంధం లేదన్నారు. ఈ సంవత్సరంలో రాష్ట్రం మంచి పురోగతి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications