తెలంగాణ సిపిపై వివక్ష అంటూ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఓయూ జెఏసి ఫైర్

అయితే ముఖ్యమంత్రి కిరణ్ తెలంగాణపై వివక్షతోనే ఆయనను తొలగించారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా తెలంగాణకు చెందిన అందరు పోలీసులు గన్ డౌన్ చేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. హోంమంత్రి సబితారెడ్డి ముఖ్యమంత్రికి ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించలేదన్నారు. హోంమంత్రి మాటను కూడా ఆయన లెక్కలోకి తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి ఒక్కరోజు ముందుగా ఫైలుపై సంతకం చేస్తే సరిపోయేదని అయితే ఆయన అందుకు పూనుకోలేదన్నారు. గ్రూపు నుండి సెలక్టు అయి అడిషనల్ డిజిపిగా ఎదిగిన వ్యక్తిగా ఆయన పేరు రికార్డులలో ఉంటుందనే వివక్ష చూపించారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications