అధిష్టానాన్ని ఒప్పిస్తాం, లేదంటే మా చావు మేం చస్తాం: ఎంపీ గుత్తా

మీడియాలో వారు రిపోర్టు తెలంగాణకు వ్యతిరేకంగా వస్తుంది అన్నట్టు పరోక్షంగా చెబుతున్నారని ఇది సరియైనది కాదన్నారు. వారి తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నివేదిక కేంద్రానికి ఇవ్వడం వరకే వాళ్ల బాధ్యత అన్నారు. పదే పదే మీడియాతో మాట్లాడడం బాధ్యతారాహిత్యం అన్నారు. నివేదిక ఇచ్చిన తర్వాత మా చావు మేం చస్తాం, మీకు అవసరం లేదన్నారు.
2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 7 తేది తర్వాతే మా నిర్ణయాలు ఉంటాయన్నారు. పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ సాధిస్తామన్నారు. లేదంటే మా చావు మేం చస్తామని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
పార్లమెంటు సభ్యులు వివేక్, మంద జగన్నాథం, పొన్నం ప్రభాకర్, పలువురు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు భేటీలో పాల్గొన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ తెలంగాణలో ఓదార్పు చేపట్టలేదని, ఎప్పుడు చేపడతాడో చెప్పలేదని ఆయన ప్రకటన తర్వాతే మేం స్పందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications