పోచారం శ్రీనివాస్‌రెడ్డి దారిలోనే సుద్దాల దేవయ్య: త్వరలో టిఆర్ఎస్‌లోకి?

Telugudesam
కరీంనగర్: తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి దారిలోనే కరీంనగర్ జిల్లా చొప్పదండి శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం సుద్దాల దేవయ్య తన కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ భేటీలో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించే అవకాశముంది. తన కార్యకర్తలతో భేటీ అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన ఇదివరకే చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీని వీడటం లేదని మాత్రం చెప్పలేదు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

తెలంగాణలోని పది జిల్లాల్లో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా తెలుగుదేశంపై ప్రజలకు నమ్మకం పోయిందని పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవార అరోపించారు. తెలుగుదేశంలో ఉంటే భవిష్యత్తు ఉండదని అందుకే తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు తీరుకు విసుగు చెందిన సుద్దాల దేవయ్య కూడా పోచారం దారిలోనే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలతో చర్చించిన అనంతరం టిఆర్ఎస్‌లో చేరే విషయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరో ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డి కూడా టిఆర్ఎస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+