డయ్యర్‌కు పట్టిన గతే పడుతుంది: గవర్నర్‌పై పాల్వాయి ధ్వజం

Palvai Govardhanreddy
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌పై ఆదివారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ నరసింహన్ మరో డయ్యర్ లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నరసింహన్ ఇలాగే ఉంటే జనరల్ డయ్యర్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. గవర్నర్ తన పలుకుబడి ఉపయోగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌ను పంపించడమే కేంద్రం చేసిన పెద్ద పొరపాటు అని అన్నారు. నరసింహన్ తీరు ఇలాగే ఉంటే రాష్ట్రంలో ఎక్కడా ఆయనను తిరగనివ్వరన్నారు. కేంద్రం ఆయనను వెంటనే వెనక్కి పిలవాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+